ప్రజావాక్కు

Voice of th People
Voice of th People

నూతన సంవత్సర వేడుక
కాలగర్భంలో మరోసంవత్సరం కలిసిపోయింది.2020 నంబ రుతోకొత్తసంవత్సరంలోకి అడుగుపెట్టాం.గడిచిన సంవత్సరం చేదు జ్ఞాపకాలనువదిలేసి, కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకోవడా నికి అందరూ సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. కొత్త సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం, కొత్త ప్రణాళికలు వేసుకోవడం, కొత్త పనులు ప్రారంభించడం లాం టివి. కొత్త సంవత్సరంమార్పు కోరుకుంటుంది. కొత్త నిర్ణయం తో కొత్తజీవితాన్ని ఆస్వాదించాలి. అయితే కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పినా, పాత సంవత్సరానికి వీడ్కోలు పలికినా అది ఒక్కరోజు మాత్రమే. మళ్లీ నిన్నటి సమస్యలే నేడు కన్పి స్తాయి. నిన్నటిమాటలే నేడు వినిపిస్తాయి.ఉల్లిగడ్డలను కొనలేక ప్రజలు అగచాట్లు పడుతూనేఉంటారు.గడచిన సంవత్సరంలో బాధపెట్టిన సమస్యలే మళ్లీ ఈసంవత్సరంలో ఉండకూడదు.

  • కాయల నాగేంద్ర, హైదరాబాద్‌
    గాంధీజీ ప్రవచనాలపై దృష్టిపెట్టాలి
    గాంధీజీ ఆలోచనలకు కాలంచెల్లిందన్నరీతిలో కొందరు మాట్లా డుతున్నారు.ఇది నిజంగా దురదృష్టకరమైన పరిణామం. నిజా నికి గాంధీజీ సిద్ధాంతాలు కాలాతీతమైనవి. ప్రస్తుతం సమా జంలో నెలకొన్న పెడధోరణులకు, హింసాత్మక విధానాలకు విరుగుడు ఆయన సిద్ధాంతాలే. నేటి విద్యార్థులకు మహాత్మా గాంధీ ఆలోచనలు విస్తృతంగా తెలియాలి. 1857-1947 మధ్య స్వాతంత్య్రోద్యమ చరిత్రను విధిగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. బాపూజీ ఆలోచనలపై విదేశాలలో విస్తృతంగా పరిశో ధనలు జరుగుతుండగా మనదేశంలో అలాంటి ఛాయలే లేవ్ఞ. గాంధీజీ ప్రవచించిన నైతికత, అహింస, ఉత్తమ విలు వలను అవలంబించడమే ఇప్పుడు యువతపై ముందున్న బాధ్యత. గాంధీజీని మన జీవన విధానంలో నిలుపుకోగల విశిష్టత ప్రతి పౌరుడు అలవరుచుకోవాలి.

-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఉపాధ్యాయుల ప్రక్షాళన అవసరం

సర్కారీ బడుల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం హర్షదాయకం. అంతకన్నా ముందుగా ఉపాధ్యాయులు ఇంగ్లీషులో బోధన చేయడానికి తగినంత కసరత్తు చేయడం అవసరం. ముందస్తుగా ఉపాధ్యాయులకు ఆంగ్లబోధనపై అవ గాహన, ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహింపచేసి ట్రయి నింగ్‌ అయిన ప్రతిభావంతులకి ఉద్యోగాలు కల్పించాలి. ఉపాధ్యాయుల ప్రక్షాళనలో నిబంధనలు పాటించాలి.

పౌరసత్వంపై ఆందోళనలు వద్దు
పౌరసత్వ చట్టంపై ప్రణాళికలు ఇంకా కొనసాగడం మంచిది కాదు.ఒకవైపు కేంద్రప్రభుత్వమేగాక ఢిల్లీ జమ్మామసీదు ఇమా మ్‌ బుఖారి వంటి వారు ఎందరో ముస్లిం మతపెద్దలు మనదేశ ముస్లింలకు నష్టం లేదని స్పష్టం చేశారు. అత్యధిక ప్రజానీకం కూడా సమర్థిస్తుంది.అయితే కొన్ని విపక్షాలు అదిగో పులి అంటే అదిగోతోక అన్నట్లు భవిష్యత్తులో ప్రమాదంఅని భయపెడుతుం టే వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో అధికారం కోల్పోయి ఒడ్డునబడ్డ చేపలా గిలగిలలాడే కొన్నికుల, ప్రాంతీయ కుటుంబ పార్టీపెద్దలు ఆగ్నికి ఆజ్యం పోస్తున్నారు. అక్రమ వలసలు పెరి గితే ఎంత ప్రమాదమో బెంగాల్‌ విధ్వంస సంఘటనలు తెలు పుతున్నాయి.అసలు ఈ సమస్య కేంద్రానిది. శరణార్థులు, చొర బాటుదార్ల సమస్యను మనదేశం పొరుగుదేశాలతో చర్చించి పరి ష్కరించుకోవాలి.ఇప్పటికే బంగ్లాదేశ్‌ తమపౌరులను స్వీకరించ డానికి వారి వివరాలను కోరింది. మనదేశంలో రెండు కోట్ల మందికిపైగా శరణార్థులు, అక్రమచొరబాటుదారులు ఉన్నారట.
-టి.సి.సాంబశివరావ్ఞ, నర్సారావ్ఞపేట, గుంటూరుజిల్ల్ల్లా

             మరణశిక్షలు తగవ్ఞ

మరణశిక్షలు ప్రపంచదేశాలలో పూర్తిగా నిషేధించాలి. తప్పిదం మానవ సహజం. తప్పు చేసిన వారికి ఆ తప్పు తెలియచేసి, తనకు తాను సంస్కరించుకునే అవకాశం ఇవ్వాలి తప్ప అంతం చేయకూడదు.మనషి సగటు జీవితం చాలా తగ్గుతుంది. వాతా వ రణ కాలుష్యం వల్ల మనిషి మనుగడ ఆయుష్షు తగ్గుతోంది. కనీసంతాబేలు జీవిత కాలానికి సగం కూడా మనిషి ఆయుష్సు లేదు. కనుక కఠిన శిక్షలు మారాలి. తప్పిదం జరిగినప్పుడు మనిషి అంతం చేయవచ్చు.కానీ తప్పిదాన్ని అంతం చేయలేం. కనుక అన్ని దేశాలలో మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలి.

-వి.ఆర్‌. కనకమ్మ, విశాఖజిల్లా
పెరుగుతున్న నిరుద్యోగం
నేడు యువత నిరుద్యోగంతో నిరుత్సాహంతో తల్లడిల్లిపోతుం ది. నిరాశానిస్పృహలతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. అన్నీ సదుపాయాలున్నా రాజకీయ నాయకులు,ధనికులు ఎన్ని నీతులైనా వల్లిస్తారు.కానీ సామాన్యవ్యక్తి మాటేమిటి? మరణశిక్ష లు దేనికీ సమాధానం కాదు. మనిషికి సంస్కరించి, ఆ మనిషి కున్న సహజమైన టాలెంట్స్‌ని సమాజానికి వాడుకోవాలి తప్ప అంతం చేయకూడదు. పాతికసంవత్సరాలు వచ్చే వరకు చదు వ్ఞలు చదివి చివరికి నిరుద్యోగి అనే పేరు సంపాదిస్తున్నారు. -కోటేశ్వరమ్మ, విశాఖపట్నం

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/