పూరి , ఛార్మీలను విచారించిన ఈడీ

,ED questions Puri Charmi

డైరెక్టర్ పూరి జగన్నాధ్ టైం ఏమాత్రం బాగాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ కావడం, డిస్ట్రబ్యూటర్స్ డబ్బుల కోసం బెదిరించడం..ఇవే అనుకుంటే ఇప్పుడు ఈడీ సైతం లైగర్ కు అన్ని కోట్లు ఎలా ఖర్చు పెట్టారు..ఎవరెవరు ఇచ్చారనే కోణంలో విచారించడం ఇవన్నీ కూడా ఆయన్ను కోలుకోలేకుండా చేస్తున్నాయి. లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ అధికారులు చార్మి, పూరి జగన్నాథ్‌లను తమ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి ఖాతాల్లోకి విధేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు జమ అయినట్లుగా గుర్తించారు.

డబ్బులు ఎవరు జమ చేశారు..? ఎందుకు జమ చేశారు ? అనే అంశాలపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. వారిని ప్రశ్నించడానికి ముందే లైగర్ అకౌంట్స్ మొత్తాన్ని ఈడీ చెక్ చేసి.. రెడీగా ఉన్నట్లుగా చెబుతోంది. ‘లైగర్’ సినిమా నిర్మాణం విషయంలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.అందుకే లైగర్ దర్శకుడు పూరికి, నిర్మాత ఛార్మీకి ఈడీ 15 రోజుల క్రితం నోటీసులు పంపించడం జరిగింది. ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. చాలా సీక్రెట్ గా పూరి ఛార్మీతో కలిసి ప్రైవేట్ గా ఈడీ ఆఫీసుకు వెళ్లారు. విదేశీ పెట్టుబడులపై వీరిని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పూరి ఈ వివాదంలో ఎవరెవరి పేర్లు బయటపెట్టారు.. నిజంగానే రాజకీయ నేతలు ఈ సినిమా కోసం పెట్టుబడులు పెట్టారా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.