యూపీ ఉప ఎన్నికలు.. బిజెపి 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

BJP releases list of 40 star campaigners for by-polls in UP

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో డిసెంబర్ 5న జరగనున్న ఉప ఎన్నికలకు బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మెయిన్ పురి, ఖతౌలీ, రాంపూర్ లో జరగనునన్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అప్పగించారు. తాజాగా వారితో పాటు మరో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పార్టీ విడుదల చేసింది. అయితే ఈ ప్రచార కార్యక్రమంలో ప్రధాని మోడీ భాగం కారని సమాచారం. అయితే ఈ జాబితాలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రి బేబీ రాణి మౌర్య, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, బిజెపి ఎంపీ హరనాథ్ సింగ్ కూడా ఉన్నారు.

మెయిన్ పురి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత డింపుల్ యాదవ్‌పై బిజెపి రఘురాజ్ సింగ్ షాక్యాను పోటీకి దింపింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అక్టోబరు 10న మరణించిన తర్వాత ఈ స్థానం ఖాళీ కావడంతో ఈ స్థానంపై ఎన్నిక తప్పనిసరి అయింది. ఇక ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ నేత ఆజంఖాన్ అసెంబ్లీకి అనర్హులుగా ప్రకటించడంతో రాంపూర్ స్థానం ఖాళీ అయింది. అనంతరం అతనికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.

ఇదిలా ఉండగా 2013లో ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించిన కేసులో బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సింగ్‌ను దోషిగా తేలడంతో ఖతౌలీలోనూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా డిసెంబర్ 5న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/