ఢిల్లీ లిక్కర్ స్కాం.. మాగుంట రాఘవ బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్

రాఘవ చూపిన కారణాలు సరైనవి కావన్న ఈడీ

ed-files-petetion-in-supreme-court-to-cancel-magunta-raghava-bail

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నిన్న రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ ఆయన చేసుకున్న విన్నపం పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్ కు రాఘవ చూపిన కారణాలు సరైనవి కావని పిటిషన్ లో తెలిపింది. రాఘవ బెయిల్ అంశంపై రేపు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అంగీకరించింది.