ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అమిత్‌ ఆరోరా అరెస్ట్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. కాగా అమిత్ బడ్జీ ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. ఇక సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

బుధవారం అరెస్ట్ అయిన అమిత్ అరోరా లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గురుగాంకు చెందిన అమిత్ అరోరా… దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ గుర్తించింది. ఇవాళ మధ్యాహ్నం ఆయనను సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టే అవకాశముంది. లిక్కర్ లైనెన్సులు జారీ చేసేందుకు అమిత్ అరోరా భారీగా డబ్బులు వసూలు చేశాడని, వాటిని వేరే సంస్ధలకు దారి మళ్లించాడనే ఆరోపణలు ఉన్నాయి.