ఆర్థిక మందగమనంతో అంతా గందరగోళం

భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయరంగం, ఉత్పాదకరంగం ఆర్థికసంకటంలో కొట్టుమిట్టాడుతున్నట్లు చెప్పవచ్చు. ప్రభుత్వరంగానికి ప్రధానంగా వచ్చే ఆదాయంలో పైన పేర్కొన్న రెండు రంగాల నుండి అధిక మొత్తంలో ఆదాయం వస్తున్నదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ ఆదాయం కోసం ప్రభుత్వాలు మరిన్ని పన్నులు వేయడం మొదలుపెట్టాయి.

విత్తలోటును తగ్గించుకోవడానికి జాతీయస్థాయిలో చేపట్టిన ఆర్థిక పునరుజ్జీవ చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని ప్రభుత్వాలు భావిస్తు న్నప్పటికీ ఆశిస్తున్న స్థాయిలో రాకపోవడం వల్ల విత్తలోటును ఎదుర్కొంటున్న ప్రభుత్వం సత్వర చర్యల కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నులు పెంచే ఆలోచనతో ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020 మధ్యకాలంలో గత ఆరునెలల్లో ఎన్నడూ లేనంతగా 4.5 శాతానికి తగ్గిపోయింది. 2018-19 సంవత్సరంలో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జిడిపి వృద్ధిరేటు 4.8శాతం.గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, ఎనిమిది ప్రధాన మౌలిక వనరుల పరిశ్రమల ఉత్పత్తి 5.8శాతం మేర తగ్గిపోయింది.

ఆర్థిక మందగమనంతో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఖర్చు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, పాలకులు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం వల్ల ఆర్థిక మందగమనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో వ్యక్తుల కొనుగోలు శక్తి తగ్గిన ప్పుడు నిత్యావసర వస్తువ్ఞల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు నామ మాత్రంగా ఉండటంవల్ల సామాన్య జనం ఆర్థికంగా దిగజారిపో వడం జరుగుతుంది. వినియోగం, ఉత్పత్తిరంగానికి మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి అన్న విషయాన్ని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండ డం వల్ల ప్రజల నుండి వచ్చే ప్రత్యక్ష పరోక్ష పన్నుల ఆదాయం తగ్గినప్పుడు, ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపడం సర్వసాధారణమైపోయింది. దీని ద్వారా విత్తలోటును తగ్గించుకోవా లనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. విత్తలోటును తగ్గించుకునే ఆలోచనలో వ్యవసాయరంగానికి, మరికొన్ని రంగాలకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి ఉంటుంది. మారిన కాలానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలను రూపొందించ డం జరుగుతుంది.

అయితే ఎన్నికల సమయాల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రజాకర్షణ పథకాలు ప్రవేశపెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని అమలుపరచడంలో నానా తంటాలు పడుతున్నా యి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రయోజనాల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా లు ప్రారంభంలోనే సంకటంలో పడిపోతున్నాయి. ఎంతో ఆర్భా టంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటనలు ఇవ్వ డం, ఆర్భాటాలు చేయడం అధికార పార్టీలకు సర్వసాధారణమైపో యింది.

అయితే పథకాలు అమలు పరచడంలో ఆర్థికలోటు పేరుతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనిస్తున్న విషయమే. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 2.7 లక్షల కోట్ల మేరకు బోరపడనుంది. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం వివిధ పథకాలపై వ్యయాన్ని పెంచింది.కానీ దానివల్ల విత్తలోటు కట్టు తప్పుతుంది.

2019-2020 భారత్‌ జిడిపి తుదిరేటు ఆరు శాతా నికి తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ లెక్కకట్టింది.స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ తగ్గడం దీనికి కార ణం అవ్ఞతుంది. పారిశ్రామిక ఉత్పత్తి కుంగి నిరుద్యోగం పెరగడం వీటితోపాటుగా ఆటోమొబైల్‌ రంగం తదితర ఉత్పత్తి రంగాలు ఉత్పత్తులు తగ్గడం వల్ల అమెరికా,చైనా వాణిజ్యంలో మన ఎగుమతులు మందగించడం చూస్తూన్న విషయమే. ఆర్థిక మందగమనాన్ని అధిగమించడనికి కేంద్రప్రభుత్వం వివిధ రంగాలలో వృద్ధికి ఊతమిస్తాయనడానికి 32 నిర్ణయాలు తీసుకుంది.

స్థిరాస్తి రంగాన్ని గాడిన పెట్టడానికి 25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఉత్పత్తిలో 49 శాతం ఆటోమొబైల్‌ రంగానిదే. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 3.7 కోట్ల మంది ప్రజలకు ఉపాధి చూపుతుంది. 2019 సంవత్సరం ప్రారంభంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 18.42 శాతం తగ్గాయి. దేశంలో ఆటోమొబైల్‌ రంగం 32 శాతం తగ్గుదలకు ప్రధానమైన కారణం ఉత్పత్తులపై పాలకుల నిర్ణయం వల్లనే ఆటోమొబైల్‌ రంగం కుదేలవ్ఞతోంది. ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యోల్బణం మెల్లగా అడుగుపెడుతుంది.

దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించడం జరుగుతుంది. ప్రణాళికబద్ధమైన మార్గదర్శక విధానాలు అమలు చేయడంలో ముందుచూపులేకుండా వ్యవహరించడం వల్లనే ఆర్థిక మందగమనం మన నెత్తిపై వేలాడుతున్న కత్తిలాగా దర్శనమి స్తోంది. భారత్‌ టెలికాం వ్యవస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ బలోపేతం చేయ లేక నేడు ఆ సంస్థ మూతపడే స్థాయికి చేరుకుంటుంది. ఆర్థిక వనరులు సమకూర్చే సంస్థగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ చేయూత లేక రోజురోజుకు దిగజారిపోతు న్నాయి. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఆధీనంలో నిర్వహించబడుతున్న సంస్థలన్నింటిని బలోపేతం చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఏదిఏమైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి కేంద్రప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. భారత స్థూల జాతీయోత్పత్తికి ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయరంగాన్ని ప్రభుత్వరంగ పారిశ్రామిక సంస్థల చైతన్యంతో ముందుకు తీసుకుపోతే చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి. ప్రపంచంలో భారత ఆర్థికవ్యవస్థ క్షీణించిందని తెలిస్తే ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ దేశ ఆర్థిక వనరులు దెబ్బతీసే విధంగా బడా పారిశ్రామికవేత్తలు పెత్తనం చెలాయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుండే నూతన ఆర్థిక విధానాన్ని అమలు చేసి ముందుకు తీసుకుపోతేనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది.

ర్థిక మందగమనంతో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఖర్చు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, పాలకులు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం వల్ల ఆర్థిక మందగమనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో వ్యక్తుల కొనుగోలు శక్తి తగ్గిన ప్పుడు నిత్యావసర వస్తువ్ఞల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు నామ మాత్రంగా ఉండటంవల్ల సామాన్య జనం ఆర్థికంగా దిగజారిపో వడం జరుగుతుంది. వినియోగం, ఉత్పత్తిరంగానికి మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి అన్న విషయాన్ని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండ డం వల్ల ప్రజల నుండి వచ్చే ప్రత్యక్ష పరోక్ష పన్నుల ఆదాయం తగ్గినప్పుడు, ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపడం సర్వసాధారణమైపోయింది. దీని ద్వారా విత్తలోటును తగ్గించుకోవా లనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. విత్తలోటును తగ్గించుకునే ఆలోచనలో వ్యవసాయరంగానికి, మరికొన్ని రంగాలకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి ఉంటుంది. మారిన కాలానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలను రూపొందించ డం జరుగుతుంది.

అయితే ఎన్నికల సమయాల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రజాకర్షణ పథకాలు ప్రవేశపెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని అమలుపరచడంలో నానా తంటాలు పడుతున్నా యి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రయోజనాల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా లు ప్రారంభంలోనే సంకటంలో పడిపోతున్నాయి. ఎంతో ఆర్భా టంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటనలు ఇవ్వ డం, ఆర్భాటాలు చేయడం అధికార పార్టీలకు సర్వసాధారణమైపో యింది. అయితే పథకాలు అమలు పరచడంలో ఆర్థికలోటు పేరుతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనిస్తున్న విషయమే. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 2.7 లక్షల కోట్ల మేరకు బోరపడనుంది.

ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం వివిధ పథకాలపై వ్యయాన్ని పెంచింది.కానీ దానివల్ల విత్తలోటు కట్టు తప్పుతుంది. 2019-2020 భారత్‌ జిడిపి తుదిరేటు ఆరు శాతా నికి తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ లెక్కకట్టింది.స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ తగ్గడం దీనికి కార ణం అవ్ఞతుంది. పారిశ్రామిక ఉత్పత్తి కుంగి నిరుద్యోగం పెరగడం వీటితోపాటుగా ఆటోమొబైల్‌ రంగం తదితర ఉత్పత్తి రంగాలు ఉత్పత్తులు తగ్గడం వల్ల అమెరికా,చైనా వాణిజ్యంలో మన ఎగుమతులు మందగించడం చూస్తూన్న విషయమే. ఆర్థిక మందగమనాన్ని అధిగమించడనికి కేంద్రప్రభుత్వం వివిధ రంగాలలో వృద్ధికి ఊతమిస్తాయనడానికి 32 నిర్ణయాలు తీసుకుంది. స్థిరాస్తి రంగాన్ని గాడిన పెట్టడానికి 25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఉత్పత్తిలో 49 శాతం ఆటోమొబైల్‌ రంగానిదే. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 3.7 కోట్ల మంది ప్రజలకు ఉపాధి చూపుతుంది. 2019 సంవత్సరం ప్రారంభంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 18.42 శాతం తగ్గాయి. దేశంలో ఆటోమొబైల్‌ రంగం 32 శాతం తగ్గుదలకు ప్రధానమైన కారణం ఉత్పత్తులపై పాలకుల నిర్ణయం వల్లనే ఆటోమొబైల్‌ రంగం కుదేలవ్ఞతోంది. ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యోల్బణం మెల్లగా అడుగుపెడుతుంది. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించడం జరుగుతుంది.

ప్రణాళికబద్ధమైన మార్గదర్శక విధానాలు అమలు చేయడంలో ముందుచూపులేకుండా వ్యవహరించడం వల్లనే ఆర్థిక మందగమనం మన నెత్తిపై వేలాడుతున్న కత్తిలాగా దర్శనమి స్తోంది. భారత్‌ టెలికాం వ్యవస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ బలోపేతం చేయ లేక నేడు ఆ సంస్థ మూతపడే స్థాయికి చేరుకుంటుంది. ఆర్థిక వనరులు సమకూర్చే సంస్థగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ చేయూత లేక రోజురోజుకు దిగజారిపోతు న్నాయి.

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఆధీనంలో నిర్వహించబడుతున్న సంస్థలన్నింటిని బలోపేతం చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదిఏమైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి కేంద్రప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. భారత స్థూల జాతీయోత్పత్తికి ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయరంగాన్ని ప్రభుత్వరంగ పారిశ్రామిక సంస్థల చైతన్యంతో ముందుకు తీసుకుపోతే చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి.

ప్రపంచంలో భారత ఆర్థికవ్యవస్థ క్షీణించిందని తెలిస్తే ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ దేశ ఆర్థిక వనరులు దెబ్బతీసే విధంగా బడా పారిశ్రామికవేత్తలు పెత్తనం చెలాయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుండే నూతన ఆర్థిక విధానాన్ని అమలు చేసి ముందుకు తీసుకుపోతేనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది.

  • డాక్టర్‌. రక్కిరెడ్డి ఆదిరెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/