ఏపిలో సంక్షేమ పథకాల అమలుపై ఈసీ కీలక ఆదేశాలు

Central Election Commission

అమరావతిః ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారంది ఈసీ. రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదన్న ఈసీ. లబ్దిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలన్నది ఈసీ. ఖాతాలకు నిధులను జమ చేయడంలో జరిగిన జాప్యంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఈసీ ఆదేశం జారీ చేసింది.

మొత్తం ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయమై జాబితాను లేఖలో ప్రస్తావించిన ఈసీ. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ. 14,165.66 కోట్లకు బటన్ నొక్కారన్న ఈసీ. ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ ముందు 11, 12వ తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో ఈసీ వెల్లడించింది. పోలింగ్ కు ముందు లబ్దిదారుల ఖాతాలకు నిధుల విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనేనని పేర్కొంది ఈసీ. ఎన్నికల కోడ్ ముగిశాక లబ్దిదారుల ఖాతాలకు నిధులు జమ చేయాలని ఈసీ ఆదేశించింది.