ఇండోనేషియాలో భూకంపం

300కు పైగా భవనాలు ధ్వంసం

Earthquake in Indonesia
Earthquake in Indonesia

ఇండోనేషియాలో తాజాగా సంభవించిన భూకంపంతో ప్రాణ , ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. . సుమారు 300కు పైగా భవనాలు ధ్వంస మయ్యాయి. బాలి దీవిలో కూడా ప్రకంపనలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2గంటలకు ఇండోనేషియా దక్షిణ తీరంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/