రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో కంప్యూటర్ బాబా
మహూడియాలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈరోజు నుండి ఆయన మహూడియా నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, నామ్ దేవ్ దాస్ త్యాగి పాల్గొన్నారు. కంప్యూటర్ బాబాగా పాపులర్ అయిన బాబా కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
కాగా, రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటి వరకూ ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్ చేరుకుంది. కన్యాకుమారి నుంచి చేపట్టిన రాహుల్ పాదయాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతూ కశ్మీర్‌లో ముగియనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/