ఏఐఎంఐఎం నేతలకు కృతజ్ఞతలు తెలిపిన బిజెపి ఎంపీ

ఏఐఎంఐఎం నేతలకు కృతజ్ఞతలు తెలిపి వార్తల్లో నిలిచారు బిజెపి నేత, పిలిబిట్ ఎంపీ వరుణ్ గాంధీ. కేంద్రానికి వ్యతిరేకంగా వరుణ్ తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ‍్యలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు కురిపించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని ఆయన అన్నారు.

కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్‌ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ‍్యలు చేశారు. వరుణ్ గాంధీ చెప్పిన ఈ లెక్కల్ని ఓవైసీ ఒక్కొక్కటిగా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అంతే కాకుండా ఈ డేటాను బీజేపీ నేత వరుణ్ గాంధీయే షేర్ చేశారంటూ పలుమార్లు పేర్కొన్నారు. కాగా, ఓవైసీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘నిరుద్యోగం నేడు దేశంలో అతిపెద్ద సమస్య. ఈ సమస్యపై ప్రభుత్వంపై దృష్టిసారించేలా యావత్ దేశ నాయకులు సహకరించాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగినప్పుడే ఈ దేశం శక్తివంతం అవుతుంది’’ అని ట్వీట్ చేశారు. ఇంకా ఈ ట్వీట్‌ను కొనసాగిస్తూ ‘‘ఓవైసీ పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నప్పుడు నా ప్రశ్నల్ని లేవకనెత్తినందుకు కృతజ్ఞతలు’’ అని చివరగా రాసుకొచ్చారు.

बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा।

मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ— Varun Gandhi (@varungandhi80) June 13, 2022