చోక్సి అపహరణలో మా ప్రమేయం లేదు.. డొమినికా ప్రధాని

ఇలాంటి కార్యకలాపాల్లో మేం పాలుపంచుకోబోం

న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్‌ కొట్టి పారేశారు. అవి పనికిమాలిన ఆరోపణలని కొట్టిపడేశారు. ఇటువంటి కార్యకలాపాల్లో తాము పాలుపంచుకోబోమని స్పష్టం చేశారు.

న్యాయస్థానాల ఎదుట నిల్చున్న ఓ పెద్ద మనిషి చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రచారం చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ అంటిగ్వాకు పారిపోగా, ఇటీవల అక్కడి నుంచి అదృశ్యమై డొమినికాలో చిక్కాడు. అతడు పెట్టుకున్న బెయిలు దరఖాస్తును ‘ఫ్లైట్ రిస్క్’ పేరుతో అక్కడి న్యాయస్థానం తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/