ఆయనకు సీఎంగా మరోసారి అవకాశం కల్పిస్తే.. నాన్ను ఎమ్మెల్యేగానే ఉండనీయండిః డీకే శివకుమార్‌

DK Shivakumar: ‘Will sit as common MLA if not made CM’

బెంగళూరుః కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా లేదు. పార్టీ విజయానికి కృషిచేసిన సిద్ధరామయ్య , డీకే శివకుమార్ ‌.. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో సీఎం ఎంపికలో పీఠముడి ఏర్పడింది. ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే మరొకరు తిరుగుబాటు చేస్తారా అనే సంశయం పార్టీలో నెలకొన్నది. దీంతో పార్టీ అధిష్ఠానం సీఎం ఎంపికలో మల్లగుళ్లాలు పడుతున్నది.

కాగా, తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకేతో ఖర్గే విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు ఇప్పటికే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఈసారి తనవంతు. తనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ అధ్యక్షుడితో అన్నట్లు సమాచారం. ఆయనకు సీఎంగా మరోసారి అవకాశం కల్పిస్తే తనను ఎమ్మెల్యేగా ఉండనీయాలని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా సిద్ధూపై రాష్ట్రంలోని ప్రధానవర్గమైన లింగాయత్‌లు వ్యతిరేకంగా ఉన్నారని డీకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నూతన సీఎం ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విషయమై పార్టీ అధిష్ఠానం బుధవారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.