మంత్రి రోజా ఫై దివ్య వాణి ప్రశంసల వర్షం

రాజకీయాల్లో ఎవరు మిత్రులుగా ఉండరు..అలానీ శత్రువులు ఉండరు..మారుతున్న రాజకీయాలను బట్టి వారు మారుతుంటారు. ప్రస్తుతం ఏపీలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికలు రాబోతున్న తరుణంలో నేతలు వారి అభిప్రాయాలను మార్చుకుంటున్నారు.గతంలో తిట్టినా వారే ఇప్పుడు ప్రశంసలు కురిపించడం చేస్తూ దగ్గరవుతున్నారు. తాజాగా మాజీ టీడీపీ నేత దివ్య వాణి , వైస్సార్సీపీ మంత్రి రోజా ఫై ప్రశంసల జల్లు కురిపించింది. టీడీపీ పార్టీ లో ఉన్న తరుణంలో రోజా ఫై నిప్పులు చేరిన ఈమె..ఇప్పుడు టీడీపీ పార్టీ నుండి బయటకు వచ్చాక అదే రోజా ఫై పొగడ్తలు కురిపిస్తుంది.

తాను టీడీపీ నుంచి తనంతట తాను వచ్చేశానో.. లేక వారే పంపించారో.. ఏదైతేనేనేమిటి.. మొత్తానికి పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అని తెలిపిదని. ఇలా టీడీపీ నుంచి బయటకు వచ్చిన నటీమణుల్లో తానొక్కతే కాదని.. శారద, జయప్రద, జయసుధ, కవిత, రోజా వీరంతా పార్టీ నుంచి ఏదొక రూపంలో బయటకు వచ్చిన వారే అంటూ గుర్తు చేసుకుంది. అయితే వీరందరిలో రోజా భిన్నమని.. టీడీపీ నుంచి బయటకు వచ్చినా.. రియల్ పొలిటిషన్ గా మారి.. నేడు మంత్రిగా ప్రజలకు సేవలకు చేస్తున్నారంటూ దివ్య వాణి మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే.. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లే నటీమణులంటే చాలా చిన్న చూపుచూస్తారని.. వారికీ జనంలో గౌరవం తగినంతగా లేదని అన్నారు. అయితే రోజా సినిమా వారు కూడా అందునా మహిళలు కూడా రాజకీయాల్లో రాణించగలని మరోసారి రుజువు చేశారంటూ దివ్య వాణి తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు రోజా తాను కలిసి పనిచేసినట్లు.. తమ ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవని చెప్పుకొచ్చింది. అంతేకాదు భవిష్యత్ లో రోజాతో కలిసి పనిచేయాల్సి వస్తే.. తప్పకుండా కలిసి పనిచేస్తానని.. తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. తాను ఏ పార్టీలో చేరనున్నదనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నానని.. మళ్లీ రాజకీయ ప్రయాణం చేస్తానని చెప్పుకొచ్చింది. దివ్య వాణి మాటలు విన్న తర్వాత ఈమె వైస్సార్సీపీ కండువా కప్పుకోవడం ఖాయమని అనిపిస్తుంది. అందుకే ఇలా రోజా ఫై ప్రశంసలు కురిపించింది అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.