ఆ నిధులు మౌళిక సదుపాయాల కోసమే

nirmala-sitharaman
nirmala-sitharaman

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ఖసమీకరించిన నిధులను ఏం చేయబోతున్నామన్నది స్పష్టంగా చెబుతున్నాం. మీ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవడానికి దీనితో వెసులుబాటు లభిస్తుంది. ప్రైవేట్‌ రంగం ప్రభుత్వానికి తోడ్పడాలి. దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రైవేట్‌ రంగానికి తోడ్పాటు అందిస్తుందిగ అని ఆమె చెప్పారు. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై విధించే సుంకాల ద్వారా వచ్చే నిధులను.. మైరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎకానమీకి ఊతమిచ్చేందుకు నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/