ఇళయ రాజా ఫై తన అభిమానాన్ని చాటుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్

ఇళయ రాజా ..ఈ పేరు వింటే సంగీత ప్రియులు ఊగిపోతారు. ఎన్నో మధురమైన పాటలు అందించి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎంతమంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చిన ఇళయ రాజా తర్వాతే ఎవరైన. ఇప్పటికి ఈయన సంగీతం అందించిన సాంగ్స్ మారుమోగిపోతుంటాయి. అందుకే నేటికీ ఆయన పేరు , ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. కేవలం సినీ లవర్స్ మాత్రమే కాదు సినీ డైరెక్టర్స్ కూడా ఇళయ రాజా అంటే ఎంతో అభిమానం కనపరుస్తుంటారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్..ఇళయ రాజాఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇళయరాజా 80వ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ జరగనుంది. పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు, ప్లే బ్యాక్ సింగర్లు ఈ ఈవెంట్‌లో ఇళయరాజా కంపోజ్ చేసిన పలు చిత్రాల్లోని పాటలు పాడనున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. ఈ మేరకు సంబంధిత ఇన్విటేషన్స్ అందినవారు ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. హరీష్ శంకర్ కూడా ఈ లైవ్ కాన్సర్ట్ కోసం తనకు అందిన ఇన్విటేషన్‌తో పాటు ఇంట్లో పూజ గది గోడపై ఇళయరాజా స్టాండింగ్ పిక్‌ పెయింటింగ్‌ను చూపించారు. దేవుడి గదిపై చిత్రీకరించడాన్ని వివరిస్తూ.. ఇళయరాజాను తను ఎంతగా ఆరాధిస్తాడో వెల్లడించాడు. ఈ వీడియోలో మరొక దర్శకుడు, రచయిత దశరథ్ కూడా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో తాను తీయబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.

https://twitter.com/harish2you/status/1628115652925075456?s=20