నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని..లోకేష్ కు నాని సవాల్

Kodali Nani

వైసీపీ మంత్రి కొడాలి నాని..నారా లోకేష్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని… నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు. లోకేశ్ ఒక పిల్ల పంది అని అన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుక్కల్ని కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు.

ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ అధికారంలోకి వస్తాడా? అని ఎద్దేవా చేశారు. ఎయిడెడ్ స్కూళ్లను కబ్జా చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అంటున్నారని… ఈ స్కూళ్లను జగన్ కి ఇస్తారా? లేక ప్రభుత్వానికి ఇస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక గుంటనక్క అని అన్నారు. కుప్పంలో టీడీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

జగన్ మోహన్ రెడ్డిని జగనన్న కాదు జగన్ దున్న అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో మంటపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ మంత్రి శంకర్ నారాయణ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక సీఎంని ఈవిధంగా మాట్లాడటం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు.