ఎన్నికలు ఉంటేనే కెసిఆర్ కు ప్రజలు గుర్తొస్తారుః షర్మిల

ప్రతిపక్షం బలంగా ఉంటే కేసీఆర్ ఆటలు సాగేవి కాదని వ్యాఖ్య

kcr-cheating-people-with-fake-promises-says-sharmila

హైదరాబాద్‌ః వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సిఎం కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ కు ప్రజలతో పని లేదని ఆమె అన్నారు. ఎన్నికలు ఉంటేనే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారని…. ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని అన్నారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అన్నీ ఒకటేనని చెప్పారు. టిఆర్ఎస్ కు బిజెపిపీ, కాంగ్రెస్ లు అమ్ముడుపోయాయని ఆరోపించారు.

కెసిఆర్ కు పరిపాలన చేతకాదని… అయితే దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా ఉంటే కెసిఆర్ ఆటలు సాగేవి కాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్ల అవినీతి జరిగినా విపక్షాలు ప్రశ్నించలేదని విమర్శించారు. కెసిఆర్ అవినీతి పాలనను ప్రశ్నించేందుకే తాను పాదయాత్రను చేపట్టానని చెప్పారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన వస్తుందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/