రంజాన్ విందులో పాల్గొన్న‌ మంత్రి తలసాని

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఈరోజు రంజాన్ విందులో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధి బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ముస్లిం బస్తీ వాసులు ఏర్పాటు చేసిన రంజాన్‌ విందుకు మంత్రి తలసాని హాజరయ్యారు. బస్తీ వాసుల కోరిక మేరకు మంత్రి మంగళవారం విందుకు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు నెల రోజులు ఎంతో నిష్ఠతో ఉపవాసం పాటిస్తారన్నారు. వారు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఎప్పటి నుండో వస్తుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేయడమే కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి తదితరులు ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/