స్పెయిన్ లో వృద్ధులకు వైద్యం నిరాకరణ

ఆసుపత్రుల్లో దయనీయ పరిస్థితులు

Corona effect in Spain

స్పెయిన్ ఆసుపత్రిలో వైద్యులు వృద్ధులను వెనక్కి పంపించేస్తున్న సంఘటన  చోటు చేసుకుంది. 

ఐసీయూల్లో ఇతర వయసుల వారికి తగినంత స్థలం ఉంచాలన్న ఉద్దేశ్యంతోనే వృద్ధులను చేర్చుకోవడంలేదట. 

స్పెయిన్ లోని  వృద్ధాశ్రమాల్లో  పరిస్థితి  ఎవరికైనా కంటతడి పెట్టించకమానదు.

జీవితచరమాంకంలో ఉన్న వృద్ధులను చూసుకునే సిబ్బంది లేకపోవడంతో ఆలనాపాలనా కరవై అత్యంత దయనీయ పరిస్థితుల్లో వృద్ధులు ప్రాణాలు విడుస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిల్లాడుతున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. ఈ యూరప్ దేశంలో ఇప్పటివరకు కరోనాతో 11,947 మంది మరణించారు.

కరోనా బాధితుల సంఖ్య 1.26 లక్షలకు చేరింది

స్పెయిన్ లోని ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిక్కిరిసి పోయింది

వైద్య సిబ్బంది కూడా సరిపోక నానాయాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/