ముంబయి జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ముంబయి ఇండియన్స్ జట్టుకు సొంతగడ్డపై ఓటమి పాలైంది. ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ముంబయి జట్టుపై విజయం సాదించింది. ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ముఖ్యంగా అక్షర్ పటేల్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. స్కోరులో 2 ఫోర్లు, 3 సిక్సులతో చెలరేగాడు. అక్షర్ విజృంభణతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ విజయ ఢంకా మోగించింది. ముంబయి జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది.
ఐపీఎల్ లో రెండో మ్యాచ్: బెంగళూరుపై టాస్ గెలిచిన పంజాబ్
ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/