ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్న ఎంఎస్‌ ధోనీ

MS Dhoni
MS Dhoni

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్13 తేదీలు ఖరారయ్యాయి. వచ్చేనెల 29న 13వ ఐపీఎల్‌కు తెరలేవనుంది. ఇక ప్రతీ ఫ్రాంచైజీ సీజన్13 కోసం సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త లోగోతో ఈ సీజన్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాళ్లు సురేష్ రైనా, అంబటి రాయుడు ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలెట్టారు. ఇక అందరి దృష్టి సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీపై నిలిచింది. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తన ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి 1వ తేదీ నుంచి చెన్నై చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌ను ఆరంభించనున్నాడు. జనవరిలో జార్ఖండ్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన మహీ.. ఐపీఎల్‌ కోసం తన ప్రాక్టీస్‌ను మరింత ముమ్మరం చేయాలని చూస్తున్నాడు. మార్చి తొలి వారం నుంచి సీజన్‌ ఆరంభం అయ్యేవరకు ప్రాక్టీస్‌ కొనసాగించాలని మహీ భావిస్తున్నాడట. ధోనీతో రైనా, రాయుడులు కూడా ప్రాక్టీస్‌ చేయనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/