మోడీ ‘మన్‌కీబాత్‌’ లో బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రస్తావన

126 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద గురించి కూడా..

modi mann ki baat- Bansilalpet stair well
PM Modi’s mann ki baat- Bansilalpet stair well

ప్రధాని మోడీ ‘మన్‌కీబాత్‌’ ప్రసంగంలోసికిందరాబాద్‌లోని బన్సీలాల్‌పేట మెట్లబావి పునరుద్ధరణ పై ప్రస్తావించారు. తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన చారిత్రాత్మకమైన బన్సీలాల్‌పేట మెట్లబావిని పునరుద్ధరించినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఏళ్లతరబడి పేరుకుపోయిన చెత్తను బావినుంచి తొలగించారు. పునరుద్ధరణ ప్రక్రియలో భూగర్భ జలాలను రీచార్జ్‌ చేసే పద్ధతులనూ ఏర్పాటుచేశారు. సమీపంలోని 140 మెట్ల బావులను పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం అప్పట్లోనే సన్నాహాలు చేపట్టింది. గుడిమల్కాపూర్‌ సమీపంలోని భగవాన్‌దాస్‌ బాగ్‌ బావోలి, శివబాగ్‌ బావోలితోపాటు పలు బావులు పునరుద్ధరించబడ్డాయి.

126 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద గురించి కూడా

తాజాగా పద్మశ్రీ ;పురస్కారం అందుకున్న యోగా గురు స్వామి శివానంద (123 ‘సంవత్సరాలు) ను కూడా మోడీ ప్రస్తావించారు. ఆయన చురుకుదనం చూసి నేను షాక్‌కు గురయ్యాను. మేము ఎదురుపడ్డప్పుడు స్వామి శివానంద నంది ముద్రలో నమస్కరించడం ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆయన దీర్ఘాయుష్సు పొందాలని కోరుకుంటున్నా..’ అంటూ అని ప్రధాని పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/