ఫిరాయింపుల వ్యతిరేక చట్టం నిర్వీర్యం!

అరికట్టడం ప్రస్తుత పార్లమెంటు కర్తవ్యం

anti-defective law
anti-defective law

ఫిరాయింపుల వ్యతిరేక చట్టం నిస్సహాయంగా నిర్వీర్యం అవుతోంది. అనర్హత వేటుపడినా, రాజీనామాలు ఆమోదించబడినా శాసనభ్యులు వెంటనే ఉపఎన్నికలలో విజయం సాధించి కొన్ని రాష్ట్రాలలో అధికారపగ్గాలు అందుకొంటున్నారు.

దురదృష్టవశాత్తు కేంద్రాధికారం కానీ, పార్లమెంటు కానీ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ అనైతిక వైఖరులను పట్టించుకొనే పరిస్థితి లేదు.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను, సూచనలను చిత్తశుద్ధితో అమలు చేయడానికి మరింత చట్టబద్ధత సమకూర్చి ఫిరాయింపుల జాడ్యాన్ని అరికట్టడం ప్రస్తుత పార్లమెంటు కర్తవ్యం.

భారత రాజ్యాంగంలో రాజ కీయ పార్టీలు, వాటి ఉనికి గురించి ప్రస్తావన లేకపోయినా ప్రజాస్వామ్య పాలనా విధానం కారణంగా రాజకీయ పార్టీల ప్రాధా న్యతతో ఫెడరల్‌ వ్యవస్థ పలు పార్టీల సమాఖ్యంగా రాష్ట్రాల సంబంధితంగా కొనసాగుతోంది.

స్వాతంత్య్రానంతరం రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్రమేపీ పార్టీ ఫిరా యింపుల పర్వం ప్రారంభమైంది.

మార్చి 1967 నుండి ఫిబ్రవరి 1968 వరకు 438 ఫిరాయింపు ఘటనలు,రాజకీయరంగంలో అవినీతి, ప్రభుత్వాల అస్థిరత తీవ్రమవ్ఞతున్నట్టు స్పష్టం చేయడమేకాకుండా పార్టీ విధానాన్ని తూట్లు పోవడం వ్యక్తమైంది.

పార్టీలలో ఆధిపత్య చీలికలు,చిన్న చిన్న ముక్కలు, నాయకత్వంపై అసహనం, అధికార దాహం శృతిమించడంతో క్రమేపీ ఓటర్ల నమ్మకాలను వమ్ము చేయడం, అంతర్గత కలహాలు, విభేదాలు మళ్లీమళ్లీ ఎన్నికల భారంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయింది.

1967-1969లో పార్టీల ఫిరాయింపులు శృతిమించడంతో, ఒక పార్టీ టిక్కెట్‌పై గెలిచి అధికార, ప్రతిపక్షపార్టీలవైపు గోడ దూకుళ్లు అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తెరపైకి వచ్చింది.

అప్పటి కేంద్రప్రభుత్వ హోంశాఖామంత్రి వై.బి. చవాన్‌ ఛైర్మన్‌గా ఏర్పడిన కమిటీ 1969 జనవరి నాటి నివేదికలో ఫిరా యింపుదారులపై అనర్హత వేటు అంశంపై ఏకాభిప్రాయంలో విఫల మైంది.

ఇంతలో లోక్‌సభ రద్దు అయింది. 1984 డిసెంబర్‌ సార్వత్రిక ఎన్నికల తరువాత 1985 జనవరిలో రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లో 52వ సవరణ చేయబడింది. ప్రజాస్వామ్యవ్యవస్థ పునాదులకు హానిచేసే, ఫిరాయింపుల చెడు పరిణామాలను, అధికార వ్యామోహాన్ని అరికట్టడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది.

10వ షెడ్యూల్‌ ఓటర్లకు గెలిచిన సభ్యులు విశ్వాసఘాతుగా వ్యవ హరించటాన్ని వ్యతిరేకిస్తోంది. కాని 10వ షెడ్యూల్‌ పార్టీలో చీలిక అంశం కారణంగా నిర్వీర్యమైంది.ఆ లొసుగు ఆధారంగా ఫిరాయిం పుదారులు అనర్హత వేటు నుంచి బయటపడగలుగు తున్నారు.

1993 జూన్‌లో జనతాదళ్‌ చీలిక ఒక అనుభవంగా మిగిలింది. 2003లో రాజ్యాంగ సవరణగా 91వ సవరణ ఫిరా యింపులను అరికట్టలేకపోయింది.

అధికార పార్టీకి విధేయులైన అసెంబ్లీ స్పీకర్‌ల నిర్ణయాధికారం, ఫిరాయింపుల వ్యతిరేక చట్టం నిష్పలం గా చట్టంలోని లొసుగుల కారణంగా గెలుపు గుర్రాలు ఓటర్ల ఆశలను వమ్ము చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అధికార మే పరమావధిగా వ్యవహరించే నైతికతను ఆశ్రయిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలతరువాత మెజారిటీ సంఖ్యాబలంప్రధానంగా అధికార,ప్రతిపక్షపార్టీలు రాజకీయ క్రీడగాపావ్ఞలుకదుపుతున్నాయి.

ఫిరాయింపుల ప్రహసనంలో చాణక్య నీతి

ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యం ప్రస్తుత 2020 నాటికి ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు కేవలం ఎన్నికల ఫలి తాల వరకే అనే భ్రమ కల్పిస్తోంది.

ఢిల్లీ పెద్దలు రాష్ట్రాలలో ఆధిపత్యం కోసం ఉవ్విళ్లూరుతూ గవర్నర్‌లను, స్పీకర్‌లను అను కూల సంఖ్యాబలం తమపార్టీకి ప్రసాదించవలసినదిగా ఆదేశి స్తున్నారు.

చిన్నాచితకా పార్టీలు ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే నిస్సిగ్గుగా రాజకీయ బేరసారాలు కొనసాగిస్తున్నాయి. గోడ దూకుళ్లు ఒక మందగా ప్రతిపక్ష శాసనసభ్యులు, అధికారదాహంతో అలమటిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ప్రాధాన్యతను కనుమరుగులేకుండా చేయాలనే తపన, అధికార పీఠానికి ఊపిరి సలపకుండా చేస్తోంది. ఫిరాయింపు రాజకీయాలు అనైతికత, అవకాశవాదంతో గుంపుగా రాజీనామాలు చేసి అధికార పార్టీ కనుసన్నులలో మళ్లీ గెలిచి మంత్రులవ్ఞతున్నారు.

నిష్పక్షపాతం, పారదర్శకత, స్వయం పాలనాధికారంతో నిర్ణయాలు తీసుకో వలసిన సభాపతులు, శాసనసభల గౌరవ, ఔన్నత్యాన్ని కాపా డలేకపోతున్నారు. కేంద్రంలోని అధికారపార్టీకి గవర్నర్లు తాబేదా రులుగా వ్యవహరిస్తున్నారు.

అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై నెగ్గుకొస్తున్న మేధావ్ఞలు చెలాయిస్తున్న విధి నిర్వహణలపై ప్రజ లకు గౌరవం సన్నగిల్లుతోంది.

తాము ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీతో పెనవేసుకొన్న అనుబంధం కారణంగా కొందరు రాష్ట్ర గవర్నర్లు, అసెంబ్లీ స్పీకర్‌లు, శాసనసభ్యుల అనైతిక పోక డలకు కళ్లెం వేయకుండా ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా కాలయాపన చేస్తున్నారు. చట్టంలో లొసుగుల ఆధా రంగా ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

2017-2020లలో మణిపూర్‌ అసెంబ్లీ ఎదుర్కొంటున్న రాజకీయ పితలాటకంలో దేశ అత్యు న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సభ్యుల అర్హతానర్హతల నిర్ధారణ సభాపతి పరిధిలోని అంశమైనా అనర్హత పిటిషన్‌ల సత్వరం పరి ష్కారం కోసం స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాలని పార్లమెం టుకు సూచించింది.

అదే నేపథ్యంలో రాజ్యాంగంలోని 142 అధికరణ అనుసారం విశిష్టాధికారాన్ని వినియోగించి తదుపరి ఆదేశాలు వెలువడేదాకా పార్టీ ఫిరాయింపుదారుడైన శ్యామ్‌కుమార్‌ సింగ్‌ను అసెంబ్లీకి హాజరు కారాదని అనుశాసించింది. దాంతోపాటే అధికార పక్షానికి అవసర సమయంలో ఆపద్భాందవ్ఞడైన ఆయ నను అమాత్యపదవి నుంచి ఊడబెరికింది.

1993లో గోవా శాసన సభాపతి ఫిరాయింపుదారులతో జతకట్టి తానే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం నాటి రాజకీయ వింతగా భారత ప్రజాస్వామ్యానికి విస్మయం కలిగించింది. అడ్డగోలుగా అధికారాన్ని కైవసం చేసుకోవ టమే దొడ్డిదారిగా కేంద్రాధికారం తమపార్టీనాయకత్వానికి ఆదేశాలు జారీ చేయడం,గవర్నర్‌ల ద్వారాసహకరించడం మనకు కొత్తకాదు.

‘సుప్రీమ్’ ఆదేశాలు సదా శిరోధార్యం

భారత ప్రజాస్వామ్యంలో అర్థశతాబ్ది క్రితం 1967లో పుట్టిన ‘ఆయారాం, గయారాం రాజకీయం తరువాత 1985లో ఫిరా యింపుల వ్యతిరేకచట్టం ఉద్భవించినా పరిస్థితిలో మార్పులేదు.

నాడు స్వతంత్ర శాసనసభ్యునిగా గెలిచిన హర్యానా ఎమ్మెల్యే గయాలాల్‌, కాంగ్రెస్‌ జనతా పార్టీల మధ్య రెండువారాలలో మూడుసార్లు కుప్పిగంతుల చరిత్ర సృష్టించాడు.

తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా, మణిపూర్‌ ప్రస్తుత మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ఓటర్ల అభీష్టానుసారం సంఖ్యాబలం సాధించిన ప్రభుత్వాలు కుప్పకూలి, రాజకీయ పార్టీలు ఒడిదుడుకుల పాలన అందిస్తున్నాయి.

ఫిరాయింపుల వ్యతిరేక చట్టం నిస్సహాయంగా నిర్వీర్యం అవ్ఞతోంది. అనర్హత వేటుపడినా, రాజీనామాలు ఆమో దించబడినా శాసనభ్యులు వెంటనే ఉప ఎన్నికలలో విజయం సాధించి కొన్ని రాష్ట్రాలలో అధికార పగ్గాలు అందుకొంటున్నారు.

దురదృష్టవశాత్తు కేంద్రాధికారం కానీ, పార్లమెంటు కానీ, ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ అనైతిక వైఖరులను పట్టిం చుకొనే పరిస్థితి లేదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను, సూచనలను చిత్తశుద్ధితో అమలు చేయడానికి మరింత చట్టబద్ధత సమకూర్చి ఫిరాయింపుల జాడ్యాన్ని అరికట్టడం ప్రస్తుత పార్లమెంటు కర్తవ్యం.

తెలుగు రాష్ట్రాల్లో కూడా శాసనభస్యులు లేదా పార్లమెంటు సభ్యులు గోడదూకుళ్లకు పాల్పడటం మనకు కొత్తకాదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో ఘన విజయం సాధించిన ఎన్‌డిఎ కేంద్రాధికారానికి అత్యధిక సంఖ్యాబలం ఉండటంతో ఏ రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులపై ఆధారపడవలసిన అగత్యం లేదు.

తెలంగాణ రాష్ట్రంలోని పటిష్ట మైన ప్రజాబలంతో ముందుకు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి సుమారు రెండేళ్ల తరువాత 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం భారత ప్రజాస్వామ్యానికే చెల్లింది.

  • జయసూర్య, సీనియర్‌ జర్నలిస్టు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/