6 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్  ప్రకటన

AP Education Minister Suresh’s statement

Amravati: కరోనా ఎఫెక్ట్ తో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  గురువారం ప్రకటించారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ఏపీ లో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.

అలాగే  సహాయక చర్యలపై ఇవాళ సాయంత్రం   సీఎం జగన్ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడతారన్నారు

రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.  332 మంది నమూనాలు పరీక్షించగా 289 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. 

మరో 33 మంది రోపోర్టులు రావాల్సి ఉందని ఆదిమూలపు సురేష్  చెప్పారు.  రాష్ట్రంలోకి వస్తున్న వారు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న తర్వాతే  ఇళ్లకు వెళ్లేందుకు అనుమ ఇస్తామని స్పష్టం చేశారు. 

నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెసులుబాటు కల్పిస్తున్నామని, కుటుంబం లో ఒక్కరు మాత్రమే బయటికొచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం  ఉంటుందని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/