ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్‌ పెత్తనం!

ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవాలి

Indian Railways
Indian Railways

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయడానికి కార్యాచరణను ప్రకటించింది.

స్వతంత్ర భారతదేశంలో స్వయంకృషితో స్వావలంబన కోసం నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను, గత పాలకులు నిర్మించి, అభివృద్ధి చేసి, సామాజిక దేవాలయాలుగా ప్రకటించిన ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం అమ్మివేస్తోంది.

ప్రపంచంలో ధీటైన సంస్థలుగా ప్రకాశింపబడుతున్న ఇస్రో, డిఎఇ, డిఫెన్స్‌ ల్యాబ్స్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్నది.

దేశంలో బిహెచ్‌ఇఎల, స్టీల్‌, కోల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ లాంటి లాభాలు గడిస్తున్న సంస్థలను దేశానికి ఆర్థిక పునాదులుగా నిలబడుతున్న బ్యాంకులు, ఇన్సూ రెన్స్‌ సంస్థలను విదేశీ, స్వదేశీదారులకు కట్టబెట్టడానికి ఉపక్ర మించింది.

రైల్వేల విషయానికి వస్తే 1853లో బ్రిటిష్‌వారు సరుకు రవాణా కోసం రైల్వేలను, పోర్టులను మనదేశంలో నిర్మిం చారు. స్వాతంత్య్రం తర్వాత మన దేశ ప్రభుత్వాలు రైల్వేలను ప్రజల కోసం ప్రజారవాణాగా ప్రభుత్వరంగంలో కొనసాగించారు.

నేడు రైల్వేలు 67,413 కి.మీ నిడివిగల మార్గాన్ని నిర్మించి దాని లో 34,319 కి.మీ నిడివిగల మార్గాన్ని ఎలక్ట్రిఫికేషన్‌ చేయడం జరిగింది.

రైల్వేలో సుమారు 12,18,335 మంది ఉద్యోగస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. సంవత్సరానికి 22591 కోట్ల రెవెన్యూతో వేల కోట్ల లాభాలతో ప్రజారవాణాలో అగ్రభాగాన నిలబడింది.

ప్రపంచంలో భారత రైల్వే అతిపెద్ద రైల్వేగా ప్రసిద్ధి చెందింది. లాభాల్లో నడుస్తున్న రైల్వేసంస్థను అక్రమాలు చేసే స్వదేశీ సంస్థలకు, పరాయి దేశస్తులైన విదేశీ సంస్థలకు కేంద్రం అప్పచెప్పడం సరికాదు.

మనదేశంలోని రైల్వేవ్యవస్థ అనేక కష్టాల కోర్చి సాంకేతికంగా అభివృద్ధి సాధించింది. స్మాల్‌గేజ్‌ నుంచి మీటర్‌గేజ్‌ దాని నుండి బ్రాడ్‌గేజ్‌కి రైల్వేలైన్లను మార్చడానికి ఎంతోకృషి చేసింది.

నేడు రైల్వేలో 88శాతం ఎఫిషియెన్సీ సాధించి ప్రపంచంలో చెప్పుకోదగ్గ ప్రతిష్టను ఏర్పర్చుకున్నది.

దీనితోపాటురైళ్లు సమాయానికి నడిపే సామర్థ్యం కూడా సాధిం చింది. కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయడంలో స్వయంసమృద్ధి సాధించి తన సత్తాను చాటుకుంటున్నది.

భవిష్యత్తులో 160కి.మీ వేగంతో రైళ్లు నడపడానికి ప్రణాళిక వేసుకున్నది.

రైలు పట్టాల డబ్లింగ్‌ పనులు పూర్తి చేసి స్పీడ్‌గా నడిచేరైళ్లకు ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్ల నుండి అంతరాయం లేని వ్యవస్థ నిర్మాణానికి కంక ణం కట్టుకొని పనిచేస్తున్నది.

ఇంత ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరుగుతున్న రైల్వేలో ప్రైవేట్‌ పెట్టుబడిదారులు వచ్చి చేసేదేమిటి?

రైలు బోగీలకు రకరకాల రంగులు వేసి ఆకర్షణీయంగా తయారు చేసి టికెట్‌ రేట్లు అధికంచేస్తారు

.ప్రైవేట్‌ రైళ్లకు రూట్లు, రేట్లు, సమయాన్ని వారే నిర్ణయిస్తారు.

దీనితో ఆదాయం వస్తున్న రూట్లు, రద్దీ ఎక్కువగా ఉండే సమయం వారు తీసుకుంటారు. రద్దీలేని సమయాన్ని ఆదాయం లేని రూట్లను ఇండియన్‌రైల్వేకు మిగిలిస్తారు. అధిక లాభాలు పొందేటట్లు టిక్కెట్టు ధరలు వారే నిర్ణయిస్తారు.

అంటే ప్రభుత్వసంస్థలో ప్రైవేట్‌ పెత్తనం అన్నమాట. ఈ రకంగా ప్రైవేట్‌వారు ఇటు రైల్వేలను, అటు ప్రజలను దోచు కొని లాభాలు గడిస్తారు. 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇలాంటి ప్రైవేటీకరణ చర్యలు సమర్థనీయంకాదు.

ఇండిగోలాంటి వారు ఫ్రాన్స్‌ లాంటి దేశాలలో రైల్వేలు ప్రభుత్వరంగంలో నడవటం మూలంగా అక్కడ అవకాశం లేని ఆల్‌స్టోమ్‌ సంస్థలలాంటి అనేక స్వదేశీ, విదేశీ కంపెనీలు రైల్వేలు నడపడానికి ముందుకువస్తున్నారు.

రైల్వే వ్యవస్థలోని లాభాలను వారి ఆస్తులను కొల్లగొట్టడమే ఈ విదేశీ, స్వదేశీ సంస్థల ముఖ్య ఉద్దేశం తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదు.

మనదేశంలోకేవలం 30వేల కోట్ల కోసం ప్రజల ఆశాజ్యోతి లాంటి రైల్వే వ్యవస్థను స్వార్థపరులకు అప్పచెప్పడం విద్రోహ చర్యగా భావించాలి.

కరోనాకు ముందు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్‌ సంస్థలకు రుణాలు మాఫీ చేసి, కరోనా సమయంలో 56వేల కోట్ల రూపాయలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికి 30వేల కోట్లు ఏ రకంగానూ భారం కాదు.

ప్రైవేట్‌పరం చేయడం మూలంగా రైల్వేల స్పీడ్‌ పెంచుతామని ప్రయాణ సమయాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతున్నది.

భారతరైల్వే 2023 సంవత్సరంనాటికి 160 కి.మీ వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టే పథకం చేసుకున్నది.

దీంతో హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పుడు పడు తున్న సమయం 14గంటల నుండి 9.30 గంటలకు తగ్గుతుంది.

అంతకన్నా తొందరగా వ్యాపార, ఇతర పనుల మీద ప్రయాణం చేయాలనుకునే వారు విమాన సర్వీసులు వాడుకోవచ్చు.

80 కోట్ల మంది అల్పాదాయ ప్రజలు ఉన్న మనదేశంలో అప్పు చేసి బుల్లెట్‌ ట్రైన్లు, దాబులు చేసి డబ్బులు గుంజే ప్రైవేట్‌ ట్రైన్లు మన ప్రజలకు అవసరం లేదు.

సరసమైన రేట్లతో భారత ప్రజా రవాణా ప్రభుత్వరంగంలోనే కొనసాగాలని ప్రజలు కోరుకుంటు న్నారు.

ప్రపంచంలోని అనేక దేశాలలో రైల్వే వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే ఉన్నది.

ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఐర్లాండ్‌ లాంటి చిన్న దేశాలు, రష్యాలాంటి అగ్రదేశాలు రైల్వేలను ప్రభుత్వరంగంలోనే నడుపుతున్నాయి.

అలాంటిది సంక్షేమ ప్రభుత్వమని రాజ్యాంగంలో నిర్దేశించుకున్న మనదేశంలో ప్రైవేట్‌రైళ్లురాజ్యాంగ స్ఫూర్తికివిరుద్ధం. కావ్ఞన కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ అనే అజెండాను వెంటనే విరమిం చుకోవాలి.

ప్రభుత్వంలోఉన్న ప్రభుత్వాల బయటఉన్న ప్రజాస్వా మ్యవాదులు,రాష్ట్రప్రభుత్వాలు భారత రైల్వేలపరిరక్షణకు ముందుకు రావాలి.

ప్రజలకోసం నిర్మితమైన ప్రజారవాణాను కాపాడుకోవడానికి ప్రజలు ఏకోన్ముకులై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి.

-వి.యస్‌.బోస్‌
(రచయిత: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎఐటియుసి తెలంగాణ రాష్ట్రసమితి)

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/