కువైట్‌లో తగ్గుతున్న పాజిటివ్‌ కేసులు

70వేల మార్కునును దాటిన రీకవరీలు

Kuwait- corona virus

కువైట్‌: కువైట్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో కువైట్‌లో తాజాగా రిక‌వ‌రీలు 70వేల మార్కును దాటాయి. గురువారం న‌మోదైన 871 రిక‌వరీల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో మొత్తం కోలుకున్న‌వారు 70,642 మంది అయ్యారు. అలాగే 622 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య 78,767కు చేరింది. ఇక నిన్న సంభ‌వించిన రెండు కొత్త మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు 509 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. ప్ర‌స్తుతం దేశంలో 7,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/