సార్స్‌ కన్నా ప్రమాదకరంగా మారిన కరోనా

811 కు చేరిన కరోనా మృతుల సంఖ్య

811 people dead in china
811 people dead in china

చైనా: కరోనా వైరస్ బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకే 811 మంది చనిపోయారని చైనా హెల్త్ కమిషన్ ధృవీకరించింది. శనివారం ఒక్కరోజు 81 మంది మంది హుబీలో చనిపోవడం కలకలం రేపుతోంది. అయితే 2002-2003లో వచ్చిన సెవెర్ అక్యుట్ రెస్పిటరీ సిండ్రోమ్ (సార్స్) వల్ల 774 మంది చనిపోయారు. సార్స్ వైరస్ కన్నా.. కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చైనా సెంట్రల్ ప్రావిన్స్‌లో మరో 2,147 కేసులు నమోదయ్యాయని చైనా హెల్త్ కమిషన్ పేర్కొన్నది. చైనా దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 36,690గా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో వైరస్‌ని విసృతిని అరికట్టగలిగామని.. కానీ అది అలానే ఉంటుందా అంటే మాత్రం చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిచింది. హుబీ రాజధాని వుహన్‌లో గల క్రూర మృగాలను విక్రయించే మార్కెట్ గుండా వైరస్ వ్యాప్తి చెందిదని చైనా హెల్త్ కమిషన్ చెబుతోంది. అదీ క్రమంగా విస్తరించి చైనా గాక ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించిందని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/