నల్గొండ జిల్లాలో షర్మిల భారీ బహిరంగ సభ

నల్గొండ జిల్లాలో షర్మిల భారీ బహిరంగ సభ

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని షర్మిల ..రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న వస్తున్న ఈమె..రేపు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి లో రేపు మధ్యాహ్నం 03 గంటలకు దళిత భేరి పేరిట భారీ సభ నిర్వహించబోతుంది.

ఈ సమావేశం లో వైఎస్ షర్మిల, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. దళిత భేరికి రావాల్సిందిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ను ఆహ్వానించారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క ద‌ళిత పేద కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాలని… మూడెక‌రాల భూమికి ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున దళిత బంధు తో కలిపి 40 ల‌క్ష‌లు ద‌ళితుల‌కు చెల్లించాలని డిమాండ్ చేయన్నారు.