ఎన్టీఆర్ షో ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీకి డొనేట్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ..తాజాగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షో లో గెలుచుకున్న డబ్బును ఛారిటీకి డొనేట్ చేసినట్లు తెలుస్తుంది. జెమినీ టీవీ లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మొదటగా రామ్ చరణ్ ఈ షో కు గెస్ట్ గా వచ్చి కిక్ ఇవ్వగా..తాజాగా అగ్ర దర్శకులు రాజమౌళి , కొరటాల శివ హాజరయ్యారు. ఈ తరుణంలో మహేష్ కూడా ఈ షో కు హాజరయ్యారట.

దీనికి సంబదించిన షూట్ రీసెంట్ గా పూర్తి అయ్యింది. షోకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. దసరా సందర్భంగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తుండగా, షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఆటలో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారని, ఆ మొత్తాన్ని ఛారిటీకి డొనేట్ చేశారని తెలుస్తోంది. అలాగే ఈ ఎపిసోడ్ హోరాహోరీగా నడిచిందని , మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ఇరువురు హీరోల ఫ్యాన్స్‌కి కిక్కిస్తుందని అంటున్నారు. ఇక త్వరలో ప్రభాస్ ని కూడా ఈ షోకి పిలిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు.