‘దాస్ కా ధమ్కీ’ నుంచి మాస్ బీట్ తో నడిచే సాంగ్!

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రంలోని మాస్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ‘ఓ డాలర్ పిలగా .. జిల్ జిలగా .. నీ జంగలు జింకనురా’ అంటూ ఈ పాట సాగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, మంగ్లీ – దీపక్ బ్లూ ఆలపించారు.

ఈ సినిమాలో ఇది ఐటమ్ సాంగ్. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే బీట్ తోనే ఈ పాట నడుస్తుంది. విష్వక్సేన్ జోడీగా నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. పృథ్వీ .. అజయ్ .. రోహిణి .. అక్షర గౌడ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

YouTube video