సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన

పాఠశాలలో దళిత బాలిక ఫై అత్యాచారం

తెలుగు రాష్ట్రాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళా కనిపించిన , అభం శుభం తెలియని మైనర్ బాలిక కనిపించిన కామ పిశాచాల్లా చెలరేగిపోతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తుండగా..తాజాగా సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఉన్న మైనర్ బాలిక ను పక్కనే ఉన్న పాఠశాలలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

గ్రామానికి చెందిన దళిత బాలిక (16) తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. అదే గ్రామానికి చెందిన పగిళ్ల సందీప్ (21) ఆమెఫై కన్నేశాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గ్రామంలో ఉత్సవం జరుగుతుండగా బాలిక ఇంటి ముందు నిల్చొని ఉంది. అప్పటికే బాలికఫై కన్నేసిన సందీప్ ఆమె నోరు నొక్కి సమీపంలోని పాఠశాలలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పరారయ్యాడు.

ఇంటికి వచ్చిన బాలికను కుటుంబసభ్యులు ఎక్కడికెళ్లావంటూ నిలదీశారు. ఆమెకు రక్తస్రావం కావడాన్ని గమనించిన అమ్మమ్మ గదిలోకి తీసుకెళ్లి ప్రశ్నించగా జరిగిన విషయం గురించి చెప్పింది. దీంతో బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు.. అనంతరం మద్దిరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.