డాక్టర్ ధనశ్రీ వర్మతో క్రికెటర్ చాహల్ వివాహ నిశ్చితార్థం
ఘనంగా రోకా కార్యక్రమం

టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ నిశ్చితార్థం పూర్తయింది. ధనశ్రీ వర్మను చాహల్ వివాహం చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో రోకా కార్యక్రమం జరిగింది.
ఈ విషయాన్ని చాహల్ ట్విట్టర్ లో వెల్లడించాడు. కాబోయే భార్య ధనశ్రీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ధనశ్రీ వర్మ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో జూమ్ వర్క్‌షాప్‌ల్లో చాహల్ ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం.
అలాగే తాను కొరియోగ్రాఫర్ యూట్యూబర్, ధనశ్రీ వర్మ సంస్థకు ఫౌండర్‌ని అని ధనశ్రీ ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పేర్కొన్నారు.
కాగా యూఏఈలో జరిగే ఐపీఎల్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చాహల్ ఇటీవలే చెప్పాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/