మోడీ – జగన్ కలిసి విశాఖ ఫ్యాక్టరీని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎందరో బలిదానాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని, అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రధాని మోడీ , ఏపీసీఎం జగన్ కలిసి అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్..ఇప్పుడు విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వెంటనే విశాఖకు వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది విశాఖ ఉక్కు పోరాట కమిటీ.

తెలంగాణ ప్రభుత్వ అధికారులు వస్తే భారీ ర్యాలీగా ఘనంగా స్వాగతించి తీసుకుని వెళతామని పేర్కొంది. ప్రజల అస్థిని ప్రభుత్వ ఆస్తిగా ఉండాలన్న కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిన జెఏసీ….బహిరంగ సభను నిర్వహించేందుకు మేం సిద్ధం అని పేర్కొంది. ఇదిలా ఉంటె బిడ్డింగ్ లో తెలంగాణ పాల్గొంటుంటే సీఎం జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఏపీలోని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ క్రమంలో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ లో తెలంగాణ పాల్గొంటే ఏపీ సీఎం జగన్ కు ఆత్మహత్యే శరణ్యమని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఏపీకి అవమానమని , జగన్‌ కు ధైర్యముంటే ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి ఆపాలని.. లేకుంటే దిగిపోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ , జగన్ కలిసి ఫ్యాక్టరీని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.