కొవిడ్‌ ఎఫెక్టుతో విమానయాన రంగం కుదేలు

COVID-19 Cuts Air Passenger Demand And Revenues
COVID-19 Cuts Air Passenger Demand And Revenues

టోక్యో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారుతోన్న కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌..ప్రత్యేకించి విమానయాన రంగంలోని కంపెనీల మనగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. పూర్తి ఎనానమీ మాటను అటుంచితే, ఈ రంగంలోని అనేక కంపెనీలు రెక్కలు తెగిన పక్షిలా పడిపోయేంతటి పరిస్థితికి దారిస్తోంది. ఇంధన భారం, డిమాండ్‌కు మించి పెరిగిన పోటీవాతావరణం వంటి అనేక సమస్యలను నెట్టుకుంటూ ముందుకు సాగుతోన్న విమానయాన కంపెనీలకు ఇప్పుడు ఆక్కుపెన్సీ (ఒక విమానంలోని మొత్తం ప్రయాణికులు) సమస్య సవాలు విసురనుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా సోకిపోయే వైరస్‌ కావడంతో వీలైనంత తక్కువగా విమానయానం చేసేందుకు చూస్తారు. దీంతో ఈ ఏడాదిలో విమానయాన రంగం భారీగానే నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోషియేషన్‌ (ఐఏటీఏ) విశ్లేంచింది. ఆక్కుపెన్సీ తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి 29 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. విమాన రద్ధీ 4.7% వరకు తగ్గనుంది. అంటే 2008 ఆర్థిక సంక్షభం సమయం తరువాత విమానయానం ఎదుర్కొనున్న అతిపెద్ద సవాలు ఇదే అవుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/