భారత్‌ పెట్టుబడులపై ఆలీబాబా అంతర్మథనం

మరికొంత కాలం వేచిచూడాలని యోచన

Alibaba
Alibaba

చైనా: చైనా ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మరికొంత కాలం వేచి చూడాలని భావిస్తుంది.

భారతదేశం- చైనా ఉద్రిక్తత కారణంగా కొంతకాలంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం.

భారతదేశంలో చైనా పెట్టుబడులపై ఆంక్షలు, భద్రతా ఆరోపణల కారణంగా అలీబాబాగ్రూప్‌ రాబోయే ఆరు నెలల వరకు భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ విషయంలో అలీబాబా గ్రూప్‌ నుంచి ఎలంటి స్పందల రాలేదు. చైనా సంస్థలపై, చైనా పెట్టుబడులపై భారత ప్రభుత్వం ఇండియా, చైనా ఘర్షణల నేపథ్యంలో కఠిన ఆంక్షలను విధిస్తోంది.

బహుళా ఈ దృష్ట్యా చైనా యొక్క ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అలీబాబా ప్రణాళికలను నిలిపివేసింది.

అలీబాబా గ్రూప్‌ యొక్క నిర్ణయం భారత దేశంలోని అలీబాబా పెట్టుబడులు పెట్టబోయే సంస్థలతో పాటు అనేక భారతీయ స్టార్టప్‌లను దిగ్బ్రాంతికి గురిచేస్తుంది.

ఇప్పటికే పేటిఎం, రెస్టారెంట్‌ అగ్రిగేటర్‌, ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ జోమాటో, ఈ కిరాణా బిగ్‌ బాస్కెట్‌లలో అలీబాబా పెట్టుబడులు ఉన్నాయి.

అయితే ఈ పెట్టుబడుల నుంచి నిష్క్రమించే ఆలోచన లేదు. కానీ కొత్త పెట్టుబడులు పెట్టడానికి మాత్రం పునరాలోచిస్తుంది.

చైనా సంస్థ అలీబాబా మరియు దాని అనుబంధ సంస్థలైన అలీబాబా కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ మరియు యాంట్‌ గ్రూప్‌ 2015 నుంచి రెండు బిలియన్‌ డాలర్లకుపైగా భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/