చైనా నుంచి భారత్‌కు రెండో బృందం

Air India flight
Air India flight

న్యూఢిల్లీ: చైనాలో రోజురోజుకీ విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా చైనాలో ఉంటున్న భారతీయుల రెండో బృందాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ విషయంపై చైనాలో ఉన్న భారత రాయబారి విక్రమ్‌ మిస్త్రీ తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ తెల్లవారుజామున వుహాన్‌ నుంచి బయలుదేరిన మరో ఎయిర్‌ ఇండియా విమానం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో మొత్తం 323 మంది బయలుదేరగా అందులో ఏడుగురు మాల్దీవులు వారు ఉన్నారని తెలిసింది. కాగా రెండో బృందంలోని నలుగురిని చైనా ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారని సమాచారం. ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న కారణంగా అధికారులు భారత్‌కు అనుమతివ్వలేదు. కాగా మరోవైపు చైనా విదేశాంగ శాఖతో పాటు స్థానిక అధికారులకు భారత రాయబారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే భారత్‌కు వచ్చిన వారిని మాత్రం ప్రత్యేక పర్యవేక్షణ మధ్య వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. వారి కోసం ప్రత్యేకంగా ఇండో-టిబెట్‌ బార్డర్‌లో గల భద్రతా దళం వద్ద ప్రత్యేక వార్డులు ఏర్పరచి వైద్యం అందిస్తున్నారు. చైనాలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీనీ ప్రకటించింది.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/