రష్యాలో మందుల షాపుల్లో కరోనా ఔషధం!

ఇప్పటికే అవిఫావిర్ కు అనుమతి

Russia-approved-a-corona-medicine-to-sell-in-shops

మాస్కో: ఆర్- ఫార్మా తయారుచేసిన ఔషధం ‘కరోనావిర్’ను స్వల్ప కరోనా లక్షణాలతో ఉండే ఔట్ పేషంట్లకు ఇచ్చేందుకు రష్యా అనుమతించింది. వచ్చే వారం నుంచి అన్ని మందుల షాపుల్లో దీన్ని అందుబాటులో ఉంచుతామని, దీన్ని ప్రిస్క్రిప్షన్ డ్రగ్ గా గుర్తిస్తున్నామని ప్రకటించింది. కొవిడ్19కు ఇప్పటికే వ్యాక్సిన్ ను ఆమోదించిన రష్యా, ఇంతకుముందే అవిఫావిర్ పేరిట ఓ ఔషధాన్ని అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే అవిఫావిర్ ను విక్రయించేందుకు ఔషధ దుకాణాలకు అనుమతి లేదు. తాజాగా, మెడికల్ షాపుల్లో అమ్మకాలకు అనుమతినిస్తూ, ఇప్పుడు మరో ఔషధాన్ని కూడా విడుదల చేసింది. ఈ రెండు ఔషధాలూ కరోనాపై పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన పావిపిరావిర్ ఆధారంగా తయారైనవే. దీన్ని జపాన్ అభివృద్ధి చేయగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/