రాచరికపు హోదాకు గుడ్‌బై

హ్యారీ, మేఘన్‌ దంపతుల నిర్ణయం

Prince Harry, Meghan
Prince Harry, Meghan

లండన్‌: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటిష్ రాజకుటుంబంతో విడిపోయారు. ఈ మేరకు ససెక్స్ డ్యూక్, డచెస్‌లు ఆదివారం నిష్క్రమణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీటిని బ్రిటన్ రాజకుటుంబం ఆమోదించింది. దీనితో రాజవంశం చరిత్రలో ఈ రాజకుటుంబ సభ్యులు రాజరిక మర్యాదలు, ఇతరత్రా అధికారిక లాంఛనాలకు దూరమయ్యే అసాధారణ ప్రక్రియ ఆరంభం అయింది. తాము రాజకుటుంబానికి దూరంగా ఉంటామనే అంతుచిక్కని నిర్ణయాన్ని ప్రకటించిన యువరాజు హ్యారీ ఇప్పుడు ఎగ్జిట్ డీల్‌కు దిగడం బ్రిటన్‌లో సంచలనానికి దారితీసింది. ఒప్పంద పత్రాలపై వీరి సంతకాలతో దీని కార్యాచరణ వచ్చే కొద్ది వారాలలో ఆరంభం అవుతుంది. ఇకపై ఈ దంపతులు తమ రాజరిక గౌరవ సూచకాలు అయిన ఖ హిజ్గ హర్ రాయల్ హైనెస్గ (హెచ్‌ఆర్‌హెచ్)లను బయట ఎక్కడ కూడా వాడుకోవడానికి వీల్లేదు. అంతేకాకుండా క్వీన్ ఎలిజబెత్‌కు అధికార హోదాలో ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించరాదు.

వారి రాజరిక విధులకు ప్రభుత్వపరంగా ఎటువంటి నిధులు అందవు. రాజకుటుంబ పలు హోదాలు వారి మర్యాదల కోసం ప్రజల నుంచి అందే పన్నులలో ఎటువంటి వాటా ఇక ఇప్పుడు వీరు మాజీ రాజకుటుంబీకులు కావడంతో దక్కకుండా పోతాయి. వారు ఇక రాజరిక వ్యక్తులు కారని, దీనిని అధికారికంగా వెల్లడిస్తున్నామని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు ఆదివారం ఒక ప్రకటన వెలువరించాయి. నెలల తరబడి కుటుంబంలో వివిధ స్థాయిలలో సంప్రదింపుల తరువాత ఇప్పుడు అనివార్యంగా ఎగ్జిట్ డీల్ కుదిరిందనే విషయాన్ని స్వయంగా హ్యారీ నానమ్మ , క్వీన్ ఎలిజబెత్ 2 నిర్థారించారు. వారు అనుకున్న విధంగా వ్యవహరించడానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందం నిర్మాణాత్మకం, వారికి సహకరించేదిగా తాను భావిస్తున్నట్లు 93 ఏండ్ల రాణి ఉద్వేగభరితంగా తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/