భారత ఐటీ రంగంపై ప్రభావం చూపనున్న కోవిడ్‌-19

coronavirus-effect-on-indian-it-sector
coronavirus-effect-on-indian-it-sector

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాలు వెంటాడుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం భారత సాఫ్టువేర్‌ కంపెనీలపై పెద్దగా కనిపించడం లేదు. అయితే వచ్చే రెండు మూడు వారాల్లో పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ రంగంపై కూడా చూపనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని వివిధ తయారీ కంపెనీలు భారత ఐటీ కంపెనీల ఖాతాదారులుగా ఉన్నాయి. అందుకే మన ఐటీ పరిశ్రమలపైనా ప్రభావం ఉండవచ్చునని భావిస్తున్నారు. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సిఎల్‌ వంటి ఇండియన్‌ ఐటీ దిగ్గజాలకు డ్రాగన్‌ కంట్రీలో యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల ద్వారా కంపెనీలు చైనాలోని తయరీ కంపెనీలకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. ఈ కంపెనీల్లో ఎక్కువగా చైనీయులే పనిచేస్తున్నారు. సేవారంగం కాబట్టి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటకే చాలా రోజులుగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే కొనసాగితే ఖర్చులు పెరితే ప్రమాదముందని టెక్‌ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/