ఎస్బిఐ శాఖల స్థానంలో ఇ-కార్నర్స్..!

ముంబై: దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుకు సంబంధించి కీలక విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు కస్టమర్లకు ఎస్బిఐ బ్రాంచులకు సంబంధించి స్పష్టత లభించింది. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచులను మూసివేసి వాటి స్థానంలో కొత్త ఇ-కార్నర్స్ను ఏర్పాటు చేస్తుందనే వార్తలు వినిపించాయి. దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చిం ది. ఇలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని పేర్కొంది. ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల పార్లమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. అనురాగ్ ఠాకూర్ మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ఇండియా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు కూడా ఏమీ లేవని స్పష్టనిచ్చింది. స్టేట్ బ్యాంకులో ప్రస్తుతం దాదాపు 2.5లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తు న్నారు. మార్చి 2021 నాటికి వీరి సంఖ్యను తగ్గించే ఉద్దేశం తమకు లేదని ఆయన తెలి పారు. పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనురాగ్ ఠాకూర్ పైవిధంగా స్పందించారు. అలాగే బ్యాంకు బ్రాంచ్ల సంఖ్యను కూడా తగ్గించబోమని స్పష్టతనిచ్చారు. ఇది బ్యాంకు ఉద్యోగులకు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
ఇకపోతే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన విషయం విదితమే. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. 50 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది. దీంతో ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసే వారికి తక్కువ రాబడి వస్తుంది. ఇప్పుడు ఎస్బిఐ ఎఫ్డి లపై 4.5శాతం నుంచి 6 శాతం మధ్య లో వడ్డీ లభిస్తుంది. ఎస్బిఐ రుణ గ్రహీ తలకు మాత్రం శుభవార్తను అందించింది. స్టేట్ బ్యాంకు ఎంసిఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఎస్బిఐ ఎంసిఎల్ఆర్ రేటు తగ్గింపు అన్ని కాల పరిమితుల్లోని రుణాలకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త రేట్లను ఒకసారి గమనిస్తే, ఏడాది ఎంసిఎల్ఆర్ 7.85శాతానికి దిగొచ్చింది. ఇది ఇదివరకు 7.9శాతంగా ఉంది. వడ్డీరేట్ల నిర్ణయం ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/