ఏపీకి చేరుకున్న 9 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు

అమరావతి: ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ తరలి వెళ్లనుంది.

కాగా, ఏపీలో రెండ్రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టీకా నిల్వలు లేకపోవడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి భారీగా కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/