సింహాలకు కరోనా పాజిటివ్

హైద‌రాబాద్ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోనే ఐసోలేష‌న్‌లో చికిత్స

corona positive to lions
corona positive to lions

Hyderabad: దేశంలో తొలిసారిగా జంతువుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కేసులు వెలుగు చూశాయి. హైద‌రాబాద్ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ సఫారిలో ఉన్న సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి, దగ్గు , కొవిడ్ లక్షణాలను గమనించారు. దీంతో వాటి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం సీసీ ఎంబీకి పంపారు. 40 ఎకరాల సఫారీ ప్రాంతంలో ఇందులో పదేళ్ల వయసున్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు ఈ లక్షణాల బారిన ప‌డ్డాయి. దీంతో జూ పార్క్ లో ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా సింహాల‌కు క‌రోనా సోకిన నేప‌థ్యంలో పార్కులోని సిబ్బందికి క‌రోనా నిర్ధారణ పరీక్ష‌లు నిర్వహిస్తున్నారు..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/