బ్రెజిల్‌లో ఒక్కరోజే 1,154 మంది

మొత్తం కేసులు 28,59,073..మొత్తం మృతులు 97,256

corona virus- Brazil

బ్రెసిలియా: కరోనా వైరస్‌ బ్రెజిల్‌లో విలయతాండవం చేస్తుంది.ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,154 మంది మృతి చెందారని పేర్కొంది. దీంతో ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 28,59,073కు చేరగా.. 97,256 మంది మృత్యువాతపడ్డారు. కాగా ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది బ్రెజిల్‌లోనే. అమెరికాలో ఇప్పటివరకు 49లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18.6 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు. కాగా కరోనా కారణంగా ఇప్పటివరకు 7లక్షలకు పైగా మృతి చెందారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత జాన్స్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఇక భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 50వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 19లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 37వేలు దాటింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/