ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 5,04,410

worldwide corona

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటి దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,02,43,859 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,04,410 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 55,53,495 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 26,37,077 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,28,437 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,93,456 మంది కోలుకున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/