కరోనా వ్యాక్సిన్‌పై మూడో దశకు చైనా ప్రమోగాలు

ఫేజ్3 దశను బ్రెజిల్ లో చేపట్టనున్నట్టు వెల్లడి

Phase-3 Trial of Sinovac’s COVID-19 Vaccine Begins

బీజింగ్‌: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్ కనుక్కునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా సంస్థ సైనోవాక్ కీలక ప్రకటన చేసింది. మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి ఫేజ్3 దశను ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఫేజ్1, ఫేజ్2 దశలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పింది. తమ ట్రయల్స్ ను బ్రెజిల్ లో చేపట్టనున్నామని…. ఈ నెలలోనే వాలంటీర్ల ఎంపిక కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

వ్యాక్సిన్ వల్ల మనుషులపై ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉన్నాయా? ఎంత డోస్ సరిపోతుంది? అనే విషయాలు ఫేజ్1, ఫేజ్2 దశల్లో తేలిపోతాయి. ఆశించిన ఫలితాలు వస్తున్నాయా? లేదా? అనే విషయం ఫేజ్3లో తేలుతుంది. మరోవైపు, ఫేజ్3 దశకు చేరుకున్న వ్యాక్సిన్ ల సంఖ్య మూడుకు చేరుకుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్కా సంయుక్తంగా చేపట్టిన ప్రయోగాలు కూడా ప్రస్తుతం ఫేజ్3లో ఉన్నాయి. దీంతో పాటు సైనోఫామ్ కు చెందిన వ్యాక్సిన్ కూడా ఫేజ్3 దశలో ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/