22 నుంచి విన్సీ ప్రీమియర్‌లీగ్‌ టీ20 టోర్నీ ప్రారంభం

క్రికెట్ టోర్నీలు గాడిలో పడే అవకాశాలు

Premier League T20 trophy

New Delhi : కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన క్రికెట్‌ టోర్నీలు క్రమక్రమంగా గాడినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెస్టిండీస్‌లోని విన్సీ ప్రీమియర్‌లీగ్‌ టీ20 టోర్నీ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఇదే బాటలో ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా పయనించేందుకు సన్నాహాలు చేస్తోంది.

జూన్‌లో టీ20, వన్డేలీగ్‌లను ప్రారంభించాలని ఆస్ట్రేలియా క్రికెట్‌ ఆశిస్తోంది. ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

అయితే ఈ మ్యాచ్‌లను ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. తొలుత టీ20 లీగ్‌ అనంతరం వన్డేలీగ్‌ను ప్రారంభించనున్నారు.

కాగా మార్చిలో కరోనా కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలని నిలిచిపోయిన తరువాత తిరిగి ప్రారంభమవుతున్న రెండో క్రికెట్‌ లీగ్‌ ఇదే.

మరో వైపు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా భారత పర్యటనపై చాలా ఆశలు పెట్టుకుంది. సిరీస్‌ కోసం 50మిలియన్‌ డాలర్ల అప్పు చేసి సన్నహాలు చేస్తోంది.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/