లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి సందేశమిచ్చారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాని మోడి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేబినెట్‌లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభపరిణామమన్నారు. కేబినెట్‌లో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశామని తెలిపారు. లోక్‌సభలో ప్రధాని మోడి ప్రసంగంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ఎంపీల డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకింగా ఆప్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 వరకు లోక్‌సభ వాయిదా పడింది.

కాగా, లోక్‌సభలో ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/