అమెరికాలో 13వేలకు చేరువలో కరోనా మృతులు

నిన్న ఒక్కరోజే 1,900 మంది మృతి

america doctors
america doctors

అమెరికా: కరోనా దెబ్బకు అమెరికా విలవిలలాడుతతుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశంగా అమెరికా నిలవగా.. ఇపుడు అత్యధిక మరణాలవైపు పరుగులు పెడుతుంది. నిన్న ఒక్కరోజే అమెరికాలో ఈ వైరస్‌ కారణంగా 1,900 మంది మరణించారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాలు 12,878 కి చేరింది. కాగా అమెరికాలో ఇప్పటివరకు 3,99,667 కరోనా కేసలు నమోదు అయ్యాయి. ఇందులో ఈ వైరస్‌ బారినుండి ఇప్పటివరకు 22,020 మంది కోలుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయపడ్డాడు. గతంలో అంచనా వేసినట్లుగా మరణాలు ఉండకపోవచ్చని.. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/