తెలంగాణలో ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి.

corona  virus
corona virus

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 40 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 404 కు చేరింది. కాగా ఇప్పటి వరకు ఈ వైరస్‌ బారినుండా 45 కోలుకోగా.. 11 మంది మరణించారు. మరో 348 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి వెల్లడించారు. గచ్చిబౌళిలోని స్పోర్ట్స్‌ కాంపెక్ల్స్‌ను రికార్డు సమయంలో 1,500 పడకల ఆసుపత్రిగా మార్చినట్లు, ఇక్కడే ఐసీయూ, వెంటిలెటర్‌ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/