నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే ఛాన్స్

Congress Working Committee

న్యూఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ కానుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇవాళ ఉదయం సమావేశం జరుగనుంది. భేటీలో ప్రధానంగా మూడు అంశాలపైనే చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు, పార్టీ కేంద్ర కార్యాలయం మార్పు, కొత్త కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేసి, మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామాను నేడు ఆమోదించనున్న సీడబ్ల్యూసీ, కొత్త అధ్యక్షుడిని నేడు ప్రకటిస్తారని సమాచారం. అన్ని అంశాలను నిరభ్యంతరంగా, స్వేచ్ఛగా సీడబ్ల్యూసీలో చర్చించాలని, నిజాయితీగా ఆత్మశోధన చేసుకోవాలని అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ మరోసారి ముందుకు వచ్చి, పార్టీ పగ్గాలను చేపడతారన్న నమ్మకం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఇండియాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ కదలాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/